Sun Mar 22 2026 01:40:40 GMT+0530 (India Standard Time)
అందుకే మరోసారి ఛాన్స్....?
మరోసారి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి ఆర్థికమంత్రి పదవి ఇచ్చే ఛాన్సులు ఎక్కువగా కన్పిస్తున్నాయి. జగన్ కు మరో ఆప్పన్ లేదు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. కొత్త ఆర్థికమంత్రిని నియమిస్తే మరిన్ని కష్టాలు తప్పవు. అందుకే జగన్ బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డికి మరోసారి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అందరూ ఊహించిందే. గత ఏడాదిన్నర కాలంగా ఆయన అమరావతిలో కంటే ఢిల్లీలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. తండ్రి బీవీ శేషారెడ్డి నుంచి రాజకీయాలను అందిపుచ్చుకున్న బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుపున గెలిచారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు పీఏసీ ఛైర్మన్ పదవిని జగన్ ఇచ్చారు. గత మంత్రివర్గంలో ఆయనకు ఆర్థిక మంత్రి పదవి ఇచ్చారు. మరోసారి ఆయనకు ఆర్థికమంత్రి పదవి ఇచ్చే ఛాన్సులు ఎక్కువగా కన్పిస్తున్నాయి. జగన్ కు మరో ఆప్పన్ లేదు.
Next Story

