Mon Mar 30 2026 18:32:07 GMT+0530 (India Standard Time)
మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘన నివాళులు
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయంలో పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయంలో పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. పూలే ఆశయాలను తమ ప్రభుత్వం నెరవేరస్తుందని సీఎం జగన్ ఆ సందర్భంగా అన్నారు. సామాజిక న్యాయం జరపడమే పూలే లక్ష్యమని, ఆ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని వైఎస్ జగన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో...
ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో బీసీ సంక్షేమం, ఐ అండ్ పీఆర్ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.
Next Story

