Sun Mar 15 2026 07:16:12 GMT+0530 (India Standard Time)
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసన
ఏపీ అసెంబ్లీ లో నాలుగో రోజు టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ పట్టుబట్టారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో నాలుగో రోజు టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ పట్టుబట్టారు. గంజాయి పై చర్చించాలంటూ సభలో టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. సభ ప్రారంభం అయిన వెంటనే స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు.
టీ బ్రేక్ కోసం...
అయితే చాలా సేపు వారిని ఆందోళన విరమించి చర్చల్లో పాల్గొనాలని స్పీకర్ కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్పీకర్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు. గత మూడు రోజుల నుంచి సభలో ఆందోళనకు దిగుతుండటంతో వారిని స్పీకర్ సస్పెండ్ చేస్తూ వస్తున్నారు.
Next Story

