Tue Jun 06 2023 14:04:42 GMT+0000 (Coordinated Universal Time)
దేవాన్ష్ పుట్టినరోజుకు భారీ విరాళం
నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజుకు శ్రీవారికి ఆ కుటుంబం భారీగా విరాళాన్ని ప్రకటించింది

నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజుకు శ్రీవారికి ఆ కుటుంబం భారీగా విరాళాన్ని ప్రకటించింది. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారికి ఒకరోజు అన్నప్రసాద వితరణకు నగదును విరాళం రూపంలో ఇచ్చింది. మూప్ఫయి మూడు లక్షల రూపాయలు విరాళంగా లోకేష్, బ్రాహ్మణ దంపతులు ఇచ్చారు.
33 లక్షలు...
ప్రతి ఏడాది నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమలలో అన్నదానానికి నారావారి కుటుంబం విరాళాన్ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా 33 లక్షల రూపాయలు అన్నప్రసాదం కోసం విరాళాన్ని ఇవ్వడం విశేషం. ప్రతిసారీ కుమారుడు పుట్టినరోజుకు ఉండే నారా లోకేష్ ఈరోజు పాదయాత్రలో ఉన్నారు. ఈరోజు ఆయన పుట్టపర్తి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దేవాన్ష్, బ్రాహ్మణిలు అనంతపురం జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయి.
Next Story