Fri Dec 05 2025 17:32:10 GMT+0000 (Coordinated Universal Time)
6వ తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ
ఈ నెల 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశముంది

ఈ నెల 6వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశముంది. హైదరాబాద్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు కావస్తుందని, అయితే విభజన చట్టం అమలులో భాగంగా అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని, వాటికి పరిష్కారం కనుగునేందుకు ఈ నెల 6వ తేదీన సాయంత్రం హైదరాబాద్ లో సమావేశం అవుదామని లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యమైన సమస్యలకు...
ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేద్దామని తెలిపారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరం కలసి కూర్చుని కొన్ని సమస్యలకు పరిష్కారానికి చర్చిద్దామని కోరారు. ఈ చర్చలు సత్ఫలితాలనిస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి దిశగా , రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని, అందువల్ల సమావేశమై చర్చిద్దామని చంద్రబాబు లేఖలో కోరారు. బహుశా ఈ నెల 6వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ జరిగే అవకాశముంది.
Next Story

