Thu Mar 19 2026 07:05:58 GMT+0530 (India Standard Time)
విశాఖలో మూడురోజులు మద్యం బంద్
విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలను బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు.

విశాఖలో మద్యంప్రియులకు మూడు రోజుల పాటు మద్యం దొరకదు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దుకాణాలను బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు. విశాఖలో ఈ నెల 11 నుంచి 13 వరకూ మద్యం దుకాణాలను బంద్ చేయాలని అధికారులు ఆదేశించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు...
విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఎన్నికలు అధికారులు ఆదేశించారు. 13వ తేదీ సాయంత్రం మద్యం దుకాణాలను తిరిగి తెరవనున్నారు.
Next Story

