Fri Mar 13 2026 15:14:04 GMT+0530 (India Standard Time)
తిరుమలలో ఈరోజు దర్శన సమయం?
శ్రీవారి దర్శనం కోసం భక్తులకు 20 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. బయట ఎంటీవీ అన్నప్రసాద భవనం వరకూ భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులకు 20 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. వీకెండ కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.
300 రూపాయలు ప్రత్యేక దర్శనం....
300 రూపాయలు ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,392 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 41,800 మంది తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.59 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story

