Tue Mar 17 2026 19:19:34 GMT+0530 (India Standard Time)
తిరుమలలో క్యూ లైన్ ఎంతవరకూ అంటే?
తిరుమల శ్రీవారి దర్శనం కావాలంటే 20 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి టీబీసీ వరకూ భక్తుల క్యూ లైన్ కొనసాగుతుంది. వీరికి దర్శనం సమయం కావాలంటే 20 గంటలు పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. రూ.300లు ప్రత్యేక దర్శనం టిక్కెట్ లు కొనుగోలు చేసిన వారికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని చెబుతున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 86,188 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,032 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం ఐదు కోట్ల రూపాయలు అని తిరులమ తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. తిరుమలలో వసతి సౌకర్యం కూడా కష్టంగా మారడంతో తిరుపతిలోనే కొందరు వసతి పొంది కొండపైకి చేరుకుంటున్నారు.
Next Story

