Fri Feb 14 2025 12:11:59 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే? సర్వదర్శనం టోకెన్లపై గుడ్ న్యూస్
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పారు.

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల జారినీ బుధవారం రాత్రి నుంచి పునరుద్దరించనున్నట్లు ప్రకటించారు. రధసప్తమి వేడుకల నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి ఎస్డి టోకెన్స్ జారినీ టీటీడీ అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. రధసప్తమి వేడుకలు ముగియడంతో తిరిగి బుధవారం రాత్రి 10 గంటల నుంచి భక్తులకు టోకెన్లను టీటీడీ అధికారులు తిరిగి జారి చేయనున్నారు. కాగా సప్తవాహనసేవల ఊరేగింపులతో సప్తగిరులు పులకించిపోయాయి.
11న చంద్రబాబు సమీక్ష...
వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, గోవిందనామస్మరణలు, కర్పూరహారతులు, భజన, నృత్య, వాద్య బృందాల ప్రదర్శనలతో నాలుగు మాడవీధులు మారుమోగాయి. మంగళవారం తిరుమలలో రథసప్తమి సంబరాలు అంబరాన్నంటాయి. లక్షలాది మంది భక్తులు రావడంతో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు మజ్జిగ, అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ అధికారులతో ఈ నెల 11వ తేదీన సమీక్ష జరపనున్నారు. తిరుమల అభివృద్ధి. భక్తుల సౌకర్యాలపై సమీక్షించనున్నారు. టీటీడీ అధికారులకు దిశానిర్ధేశం చేయనున్నారు.
రద్దీ సాధారణమే...
మరోవైపు నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తులు సులువుగానే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. నిన్న ఎక్కువ మంది భక్తులు రావడంతో కిటకిటలాడిన తిరుమల గిరులు నేడు కొంత తగ్గినట్లు కనిపిస్తుంది. అయినా దర్శనానికి ఎనిమిది గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నేడునేరుగా స్వామి వారిని దర్శించుకునేందుకు వీలుగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.21 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story