Tue Mar 24 2026 06:55:58 GMT+0530 (India Standard Time)
తిరుమలలో రేపు పౌర్ణమి గరుడ సేవ రద్దు
తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు

తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా రేపు పౌర్ణమి గరుడ సేవను రద్దు చేస్తామని చెప్పారు. చంద్రగ్రహణం రోజు అయిన మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ శ్రీవారి ఆలయ తలుపులను మూసివేయనున్నారు.
చంద్రగ్రహణం కారణంగా...
చంద్రగ్రహణం కారణంగా అన్ని రకాల దర్శనాలు, సేవలను రద్దు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. గరుడసేవను కూడా రద్దు చేసింది. ఆలయ శుద్ధి, ఇతర కైంకర్యాల అనంతరం రాత్రి 7.30 గంటల తర్వాత సర్వదర్శనం భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు.
Next Story

