Fri Dec 05 2025 14:02:01 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీకి కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలివే
ఆంధ్రప్రదేశ్ లో కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి రైల్వే బోర్డుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు

ఆంధ్రప్రదేశ్ లో కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి రైల్వే బోర్డుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. మొత్తం 1,336 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ల నిర్మాణం చేపట్టేందుకు 2,982 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశారు. భద్రాచలం-కొవ్వూరు 70 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ల నిర్మాణం చేపట్టాలని ఈ ప్రతిపాదనలో పొందుపర్చారు.
విశాఖ రైల్వే జోన్...
ముద్దనూరు-పులివెందుల-ముదిగుబ్బ-శ్రీసత్యసాయిజిల్లా వరకూ 105 కిలోమీటర్లు, అట్టిపట్లు-పుత్తూరు 30 కిలోమీటర్లు, 205 కిలోమీటర్ల మేర కొత్త లైను ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. మరొకవైపు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు వేగవంతం చేశారు. కొత్త జోన్‌కి పీహెచ్వోడీల నియామకంపై దృష్టి పెట్టారు. పీహెచ్వోడీల నియామకం పూర్తికాగానే దక్షిణకోస్తా జోన్‌పై నోటిఫికేషన్ వెలువడే చాన్స్ ఉందని చెబుతున్నారు.
News Summary - officials have sent proposals to the railway board for the construction of new railway lines in andhra pradesh
Next Story

