Fri Dec 05 2025 09:51:19 GMT+0000 (Coordinated Universal Time)
'ఆడుదాం ఆంధ్ర' స్కామ్‌పై విచారణ పూర్తి
వైసీపీ హయాంలో 'ఆడుదాం ఆంధ్రా'లో జరిగిన స్కామ్‌పై విచారణ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు.

వైసీపీ హయాంలో 'ఆడుదాం ఆంధ్రా'లో జరిగిన స్కామ్‌పై విచారణ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కొంత కాలం నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విచారణ జరుపుతున్నారు.
నేడో, రేపో నివేదిక...
దీనికి సంబంధించిన విచారణ పూర్తి కావడంతో డీజీపీకి నేడో, రేపో నివేదిక విజిలెన్స్ విభాగం సమర్పించనున్నట్లు తెలిసింది. "ఆడుదాం ఆంధ్రా"లో జరిగిన స్కామ్‌లో మూలాలు వెలికితీసినట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలస్తోంది. నివేదికలో అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు ప్రభుత్వం తీసుకోనేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
Next Story

