Mon Dec 08 2025 22:27:09 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో కరోనా కేసులు ఎన్నంటే?
తాజాగా 18,257 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా తో 42 మంది మరణించారు

భారత్ లో కరోనా కేసులు తగ్గడం లేదు. కేసుల సంఖ్య ఈరోజు స్థిరంగా ఉంది. ఒక్కరోజులో 18,257 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కారణంగా 42 మంది మరణించారు. కోవిడ్ నుంచి నిన్న 14,553 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి శాతం 98.50 శాతంగా నమోదయింది. కోలుకునే వారి శాతం ఎక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమే.
వ్యాక్సినేషన్...
మరోవైపు యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య శాతం 0.30 శాతం పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.22 శాతంగా నమోదయింది. భారత్ లో ఇప్పటి వరకూ దేశంలో 4,36,22,651 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా కారణంగా ఇప్పటి వరకూ 5,25,428 మంది మరణించారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 1,28,690 మంది కోలుకున్నారు. కరోనా వైరస్ సోకి 4,29,68,533 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య ఇప్పటి వరకూ 1,98,76,59,299 కు చేరుకుంది.
Next Story

