Mon Feb 02 2026 05:06:05 GMT+0000 (Coordinated Universal Time)
అలర్ట్.. శ్రీశైలం వెళ్లు భక్తులు...?
నూతన సంవత్సరం, ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైలంలో అధికారులు గర్భాలయ దర్శనాలు రద్దు చేశారు.

నూతన సంవత్సరం, ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైలంలో అధికారులు గర్భాలయ దర్శనాలు రద్దు చేశారు. నేటి నుంచి జనవరి 2వ తేదీ వరకూ గర్భాలయ దర్శనాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రెండు రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశమున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.
మూడు రోజులు రద్దు...
జనవరి ఒకటో తేదీ కొత్త సంవత్సరం, రెండో తేదీ ముక్కోటి ఏకాదశి కావడంతో మూడు రోజుల పాటు గర్భాలయ దర్శనాలను రద్దు చేశారు. అలాగే స్వామి వారి అభిషేకాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా అధికారులు రద్దు చేశారు. జనవరి 2వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామి, అమ్మవార్లను ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనాలను కల్పిస్తారు. భక్తులు ఈ విషయం గమనించి శ్రీశైలానికి రావాలని అధికారులు కోరుతున్నారు.
Next Story

