Fri Dec 05 2025 09:05:46 GMT+0000 (Coordinated Universal Time)
Srisailam : రేపు శ్రీశైలం గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారుల సన్నాహాలు చేస్తున్నారు

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారుల సన్నాహాలు చేస్తున్నారు. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి ఉదయం గేట్లు అధికారులు ఎత్తనున్నారు.జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడికి అధికారులు ఆహ్వానం పంపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులను కూడా అధికారులు ఆహ్వానిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం చేరుతుండటంతో గేట్లు ఎత్తాలని అధికారుల నిర్ణయించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా...
గతంలో ఎన్నడూ లేనివిధంగా జూన్ లోనే వరద ప్రారంభమయింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు ముందుగానే వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు చేరింది. జులై మొదటి వారానికి దాదాపు నిండిపోయిన శ్రీశైలం ప్రాజెక్టునుమంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా గంగా హారతి ఇవ్వనున్నారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు ప్రజాప్రతినిధులు, అధికారులు చేసి గేట్లు ఎత్తి సాగర్ కు నీటిని మంత్రులు, ప్రజాప్రతినిధులు విడుదల చేయనున్నారు.
Next Story

