Sun Mar 15 2026 07:19:18 GMT+0530 (India Standard Time)
వైసీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ రాజీనామా
వైసీపీని వీడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీకి రాజీనామా చేశారు.

వైసీపీని వీడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ శాసనసభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా పోతుల సునీత రాజీనామా చేశారు. పోతుల సునీత టీడీపీ నుంచి వచ్చిన వారే. తిరిగి ఆ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది.
ఇద్దరు రాజ్యసభ సభ్యులు....
అయితే తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తానని పోతుల సునీత తెలిపారు. ఎమ్మెల్సీ పోతుల సునీతతో పాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు కూడా రాజీనామా చేయనున్నారు. ఇందులో బీద మస్తాన్ రావు టీడీపీ నుంచి వచ్చిన వారే. ఆయనకు జగన్ రాజ్యసభ పదవి ఇచ్చారు. నెల్లూరుకు చెందిన బీద మస్తాన్ రావు వైసీపీలో చేరగా, ఆయన సోదరుడు బీద రవిచంద్ర మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు.
Next Story

