Thu Mar 19 2026 21:32:39 GMT+0530 (India Standard Time)
Tirumala : కంపార్ట్మెంట్లు బయటకు విస్తరించిన క్యూ లైన్
తిరుమలలో భక్తుల సంఖ్య అధికంగా ఉంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమలలో భక్తుల సంఖ్య అధికంగా ఉంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వీకెండ్ లో తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటారు. శని, ఆదివారాలు స్వామి వారి దర్శనం ఎక్కువ సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు నేడు శ్రీవారి దర్శనం నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 60,958 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,245 మంది తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి ఆదాయం 3.41 కోట్ల రూపాయలు వచ్చింది. నేడు అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయి బయట సేవాసదన్ వరకూ క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనానికి మాత్రం ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
Next Story

