Tue Mar 17 2026 07:51:00 GMT+0530 (India Standard Time)
36 గంటలు.. దర్శన సమయం
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. మంగళవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. మంగళవారం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనానికి 36 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించరు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఇప్పుడు వచ్చే వారికి నలభై గంటల సమయం పైగానే పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 62,152 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 30,682 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

