Mon Mar 16 2026 21:49:33 GMT+0530 (India Standard Time)
నేడు తిరుమలలో రష్?
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. శుక్రవారం భక్తుల సంఖ్య తిరుమలలో మరింత పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. శుక్రవారం భక్తుల సంఖ్య తిరుమలలో మరింత పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం ఐదుగంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులులు వెల్లడించారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ఏడు గంటలకు క్యూ లైన్ లో ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసిన శ్రీవారి భక్తులకు శీఘ్రదర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 58,955 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 25,113 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.50 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

