Tue Mar 17 2026 04:12:59 GMT+0530 (India Standard Time)
అమ్మో దర్శనానికి ఇంత సమయమా?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. రేపు రథసప్తమి కావడంతో నేటి నుంచే భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. రేపు రథసప్తమి కావడంతో నేటి నుంచే భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 36 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండి పోయి క్యూ లైన్ ఏటీజీ వరకూ కొనసాగుతుంది. సర్వదర్శనం భక్తులకు దర్శన సమయం ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. ఎస్ఎస్డీ టోకెన్లు తీసుకోకుండా క్యూ లైన్ లో ప్రవేశించే భక్తులకు దర్శనానికి 36 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ప్రత్యేక దర్శనం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 58,379 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,950 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 36 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
Next Story

