Tue Mar 17 2026 02:32:12 GMT+0530 (India Standard Time)
తిరుమలలో రద్దీ ఈరోజు...?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం భక్తులకు ఐదు గంటల వరకూ దర్శన సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం టోకెన్లు లేకుండా క్యూ లైన్ లో ప్రవేశించే భక్తులకు దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
24 గంటల సమయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు రెండు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 78,340 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,063 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.30 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

