Fri Dec 05 2025 22:14:45 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగిందిగా.. శనివారంతో పాటు?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో పాటు వైకుంఠ ద్వార దర్శనాలు రేపటితో ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలను ఏడులక్షలమందికిపైగా చేసుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రోజుకు కొన్ని టోకెన్లు మాత్రమే జారీ చేయడంతో రద్దీ తగ్గించాలని అధికారులు భావించినప్పటికీ సాధారణ భక్తులు కూడా వచ్చి వైకుంఠ ద్వార దర్శనం కోసం పోటీ పడుతున్నారు.
టోకెన్ల జారీ ముగించిన టీటీడీ...
వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఇవ్వడం పూర్తయింది. జనవరి 20 వ తేదీన దర్శనానికి తిరుపతి లో ఎస్ఎస్డీ టోకెన్లు ఇవ్వమని అధికారుల తెలిపారు.తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం జనవరి 19వ తేదీ చివరి రోజు కోసం జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల జారీ శుక్రవారం తో పూర్తి అయింది. జనవరి 20న శ్రీవారి దర్శనం కోరే భక్తులు సర్వ దర్శనం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. క్యూ లైన్లో చేరుకుని మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 19న వైకుంఠ ద్వార దర్శనం ముగియడంతో భక్తులు గమనించి తిరుమలకు చేరుకోవాలని టీటీడీ కోరింది.
ఆదివారం నుంచి సర్వదర్శనాలు...
19న వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది. ఆదివారం రానుండడంతో భక్తుల రద్దీ అధికం ఉంటుందని భావించిన అధికారులు జనవరి 20వ తేదీన సర్వదర్శనం భక్తులు క్యూలైన్లు లోకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. జనవరి 20 వ తేదీ దర్శనానికి గాను ముందు రోజు అనగా 19న ఆఫ్లైన్లో శ్రీ వాణి టిక్కెట్లు జారీ చేయరని కూడా తెలిపింది. జనవరి 20న ప్రోటోకాల్ మినహా బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని, ఇందువలన ముందు రోజు అనగా 19న విఐపి బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించమని తెలిపింది.నిన్న తిరుమల శ్రీవారిని 61,142 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,736 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.15 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story

