Wed Mar 18 2026 03:14:02 GMT+0530 (India Standard Time)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్స్ కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయింది

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్స్ కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువయింది. వైకుంఠం కాంప్లెక్స్ లోని 28 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శ్రీవారి దర్శనానికి ఈరోజు దాదాపు 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం....
నిన్న తిరుమల శ్రీవారిని 79,525 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 39,545 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.04 కోట్లు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story

