Mon Mar 16 2026 21:49:17 GMT+0530 (India Standard Time)
తిరుమలలో అమాంతం పెరిగిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి బయట టీబీసీ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఉదయం ఏడు గంటలకు సర్వదర్శనం క్యూలైన్లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే వారికి స్వామి వారి దర్శనం ముప్పయి ఆరు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,452 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 39,262 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

