Mon Mar 16 2026 18:40:27 GMT+0530 (India Standard Time)
తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పదహారు కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. వీరికి దర్శన సమయం ఐదు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదహారు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,687 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 25,090 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.95 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

