Sat Jan 31 2026 21:48:51 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఏపీ డెయిరీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలెప్ మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది

ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలెప్ మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. జిల్లా స్థాయిలో మేనేజర్ గా విధులు నిర్వహించేందుకు వివిధ జిల్లాల నుండి తొమ్మిది మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టుకోసం దరఖాస్తు చేసుకునే వారి విద్యార్హతలను డైరీ టెక్నాలజీలో బీటెక్ లేదా ఎంబీఏలో మార్కెటింగ్ చేసి ఉండాలి.
అర్హతలివీ...
ఫ్రెషర్స్ అయినా లేదా సంబంధిత డెయిరీ ఫీల్డ్ లో అనుభవం ఉండాలి. జీతం నెలకు ఇరవై వేల రూపాయలు చెల్లిస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ లో ఈనెల 26వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమితులవుతారు. తరువాత అవసరమైతే పనితీరు బట్టి కాంట్రాక్ట్ పొడిగిస్తారు. మరిన్ని వివరాలకు https://apddcf.ap.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చు.
Next Story

