Tue Mar 17 2026 15:49:08 GMT+0530 (India Standard Time)
రెండు గంటల్లోనే దర్శనం
తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ పెద్దగా లేదు. కేవలం రెండు గంటల్లోనే వెంకటేశ్వరుడి దర్శనం భక్తులకు లభిస్తుంది

తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ పెద్దగా లేదు. కేవలం రెండు గంటల్లోనే వెంకటేశ్వరుడి దర్శనం భక్తులకు లభిస్తుంది. వైకుఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్మెంట్లలోనే భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న చంద్రగ్రహణం కావడంతో ఎవరూ తిరుమలకు రాకపోవడంతో ఈ పరిస్థితి ఉందని తెలిసింది. ఇక ఇప్పడు క్యూలైన్ లో వచ్చేవారికి మాత్రం మరో గంట అదనంగా సమయం పట్టే అవకావముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
వీరికి మాత్రం...
మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి రెండు గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారరు. నిన్న తిరుమల శ్రీవారిని 22,423 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు. 9,679 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Next Story

