Thu Jan 29 2026 00:07:50 GMT+0000 (Coordinated Universal Time)
మృతిచెందిన తర్వాత జాహ్నవికి డిగ్రీ
రోడ్డు ప్రమాదంలో మరణించిన కందుల జాహ్నవికి డిగ్రీ ఇవ్వాలని అమెరికాలోని యూనివర్సిటీ నిర్ణయించింది

రోడ్డు ప్రమాదంలో మరణించిన కందుల జాహ్నవికి డిగ్రీ ఇవ్వాలని అమెరికాలోని యూనివర్సిటీ నిర్ణయించింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ అధికారికంగా ప్రకటించారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి మృతి చెందిన సంగతి తెలిసింది. జాహ్నవి మృతి పై అమెరికా పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన వైరల్ కావడంతో భారత ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దీంతో అలా వ్యవహరించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.
వైఎస్ ఛాన్సిలర్ ప్రకటనతో...
కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి ఎంఎస్ చేయడానికి నార్త్ ఈస్టరన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేయడానికి వెళ్లింది. అక్కడ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ విద్యార్థినికి మరణానంతరం డిగ్రీ ఇవ్వనున్ననట్లు వైస్ ఛాన్సిలర్ తెలిపారు. జాహ్నవి మృతితో ఆమె సహచర విద్యార్థులు కూడా ప్రభావితులయ్యారని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి కారకులైన వారికి శిక్ష పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జాహ్నవి కుటుంబ సభ్యులకు డిగ్రీ అందచేయనున్నట్లు తెలిపారు.
Next Story

