Sat Mar 28 2026 04:21:17 GMT+0530 (India Standard Time)
జోగి రమేష్ పై నాన్ బెయిల్ బుల్ కేసు
మాజీ మంత్రి జోగి రమేష్ పై నాన్ బెయిల్ బుల్ కేసు నమోదయింది

మాజీ మంత్రి జోగి రమేష్ పై నాన్ బెయిల్ బుల్ కేసు నమోదయింది. నిన్న జగన్ పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ప్రజలకు అసౌకర్యం కల్గించారని కేసు నమోదదయింది. ఎస్సై రవి వర్మ ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీంతో జోగి రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల విధులకు ఆటంకం...
జనసమీకరణ భారీగా చేయడంతో ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలగడంతో ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్ రావడంతో ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయని పోలీసులు తెలిపారు.
Next Story

