Sat Sep 14 2024 23:44:20 GMT+0000 (Coordinated Universal Time)
Visakha Mlc Elections : రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు.. ఇంకా అభ్యర్థిని ప్రకటించని టీడీపీ
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ల కార్యక్రమం రేపటితో ముగియనుంది. అయితే ఇంత వరకూ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ప్రకటించలేదు
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ల కార్యక్రమం రేపటితో ముగియనుంది. అయితే ఇంత వరకూ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రధానంగా టీడీపీ తన అభ్యర్థిని బరిలోకి దించాలని అనుకుంటోంది. ఈ మేరకు చంద్రబాబు దఫాలుగా విశాఖ జిల్లా నేతలతో చర్చలు జరిపారు. అయితే అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేదు.
గెలవాలంటే...
విశాఖ జిల్లా టీడీపీ నేతలు మాత్రం పోటీ చేయాలంటున్నారు. అయితే మొత్తం 850 ఓట్లుండగా అందులో 550 ఓట్లు వైసీపీ వైపు ఉన్నాయి. కమ్యునిస్టు పార్టీలు ఈ ఎన్నికకు దూరంగా ఉంటాయని ప్రకటించాయి. దీంతో టీడీపీ గెలవాలంటే 150 కి పైగా వైసీపీ ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవాల్సి ఉంటుంది. అది జరిగే పనేనా అన్న భావనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. అభ్యర్థిని ప్రకటిస్తే ఈరోజు అర్థరాత్రి కాని, రేపు ఉదయం కానీ ప్రకటించే అవకాశముంది. లేకుంటే పోటీలో లేకుండా తప్పుకునే అవకాశాలున్నాయి.
Next Story