Sat Mar 07 2026 16:33:14 GMT+0530 (India Standard Time)
Breaking : కొత్త చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు

ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నీరబ్ కుమార్ ప్రసాద్ సీనియర్ ఐఏఎస్ కావడంతో ఆయనను నియమానికి చంద్రబాబు మొగ్గుచూపారు. నీరబ్ కుమార్ ప్రసాద్ 1987 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.
బదిలీ కావడంతో...
ఇప్పటి వరకూ చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. కొత్త చీఫ్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ తక్షణమే బాధ్యతలను స్వీకరించనున్నారు. సీఎస్ జవహర్ రెడ్డి బదిలీ కావడంతో ఆయన నియామకం వెంటనే జరిగింది. ఈ నెల 12వ తేదీన జరిగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఏర్పాట్లను కూడా ఆయన చూడాల్సి ఉంది.
Next Story

