Mon Feb 02 2026 07:46:44 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూను పొడిగించారు. నైట్ కర్ఫ్యూ ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూను పొడిగించారు. నైట్ కర్ఫ్యూ ను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో గత నెల రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ అమలవుతుంది. దీని వల్ల కేసులు కొంత తగ్గుముఖం పడుతున్నాయి. తొలి రోజుల్లో పథ్నాలుగు వేల కేసులు రోజుకు నమోదు కాగా, ప్రస్తుతం ఐదువేలకు దిగువకు చేరుకున్నాయి.
ఈ నెల 14 వరకూ...
అయినా ప్రభుత్వం మాత్రం నైట్ కర్ఫ్యూ ను పొడిగించాలని నిర్ణయించింది. ఈ నెల 14 వ తేదీ వరకూ నైట్ కర్ఫ్చూ అమలులో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. నైట్ కర్ఫ్యూ యధా ప్రకారం జరుగుతుందని, అందరూ దీనికి సహకరించాలని కోరింది.
Next Story

