నెల్లూరులో ఏడో తరగతి విద్యార్థినిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారం...!
నెల్లూరులో శిశుమందిర్ విద్యార్థినిపై వ్యాన్ డ్రైవర్ అత్యాచారం.. వరుస లైంగిక దాడులతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

ఆంధ్రప్రదేశ్‌లో వరుస లైంగిక దాడి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నెల్లూరులోని ఓ శిశుమందిర్‌లో ఏడో తరగతి విద్యార్థినిపై వ్యాన్ డ్రైవర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు కడుపునొప్పితో బాధపడుతుండగా, తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు. గతంలోనూ ఇదే పాఠశాలలో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురయ్యారని ఆరోపణలు ఉన్నాయి.
ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం: నిందితుడు అరెస్టు
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. పెయింటింగ్ పనులు చేసే షేక్ హుస్సేన్ ప్రేమ పేరుతో బీటెక్ విద్యార్థినిని లోబర్చుకుని, తన స్నేహితుడు సిద్ధు రూమ్‌లో ఉంచి వెళ్లిపోయాడు. అక్కడ సిద్ధు ఆమెపై అత్యాచారం చేసి, న్యూడ్ ఫోటోలు తీసి స్నేహితులకు చూపించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సిద్ధును అరెస్టు చేశారు.