Sun Dec 14 2025 13:39:33 GMT+0000 (Coordinated Universal Time)
నీ పెతాపం దమ్ముంటే నామీద చూపించు
తనను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు

తనను అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని పనులు వదిలేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంపైనే దృష్టి పెట్టారన్నారు. ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ముఖ్యమైన అనుచరుడు తాటి వెంకటేశ్వర్లును అరెస్ట్ చేయించారన్నారు. ఆ వెంటనే జావీద్, మన్నేపల్లి రఘును కూడా అరెస్ట్ చేయించారని, ముగ్గురిని దుర్మార్గంగా అరెస్ట్ చేయించి తనను అభిమానించే వారిని భయాందోళనలకు గురి చేయాలని చూస్తున్నారన్నారు.
నన్ను అడ్డుకోవడం నీ తరం కాదు
ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లకుండా హైవే పైన తిప్పుతూ మానసికంగా వేధించారన్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి 11 గంటల వరకూ అనేక పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ భయాందోళనలకు గురి చేశారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. వేధింపులకు తన వెనక నడిచే నేతలు, కార్యకర్తలు ఎవరూ లెక్క చేయరని, చివరకు తన డ్రైవర్లు కూడా పట్టించుకోరన్నారు. ఇలాంటివి వీఆర్ కళాశాలలో చూశానని, తనకు కొత్త కాదని కోటంరెడ్డి అన్నారు. తనను కూడా అరెస్ట్ చేయవచ్చని, తాను నియోజవర్గంలోనే ఉంటానని, ఇలాంటి బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు కోటంరెడ్డి. దమ్ముంటే ప్రతాపం తన మీద చూపించాలని, తన అనుచరుల మీద కాదని సవాల్ విసిరారు
Next Story

