Fri Dec 05 2025 21:43:07 GMT+0000 (Coordinated Universal Time)
రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ సిఫార్సు లేఖపై కోటంరెడ్డి ఏమన్నారంటే?
రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కు తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ కు తాను లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. అయితే శ్రీకాంత్ తండ్రి తన వద్దకు రావడంతో ఆ లేఖ ఇచ్చినట్లు తెలిపారు. తన కోసం అనేక మంది వస్తుంటారని, వారికి సిఫార్సు లేఖలు ఇస్తుంటానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు. అంతే తప్ప మరో ఉద్దేశ్యం అందులో తనకు కనపడలేదన్నారు.
ప్రజాప్రతినిధులుగా...
ఎందరో వచ్చి తన నుంచి ప్రజలు సిఫార్సు లేఖలు తీసుకెళుతుంటారని, ప్రజాప్రతినిధులుగా తాము లేఖలు ఇవ్వడంలో తప్పులేదన్న ఆయన గతంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కివిలేటి కూడా సిఫార్సు లేఖలు శ్రీకాంత్ పెరోల్ కోసం ఇచ్చారన్నారు. అయితే తాను శ్రీకాంత్ పెరోల్ పై ఇచ్చిన లేఖను అధికారులు తిరస్కరించారని కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.
Next Story

