Sat Mar 14 2026 06:14:21 GMT+0530 (India Standard Time)
అసెంబ్లీలో కోటంరెడ్డి నిరసన
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని ఆయన పాదయాత్రగా అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరగనుంది.
ఆత్మప్రభోదానుసారం...
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో తన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మప్రభోదానుసారం ఓటు వేస్తానని చెప్పారు. కోటంరెడ్డి అసెంబ్లీలో నినాదాలు చేస్తుండటం తగదని మంత్రులు చెప్పారు.
Next Story

