Thu Jul 07 2022 07:25:25 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి గుండెపోటు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆమంచర్ల గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో గుండె నొప్పి గా ఉండటంతో పలుమార్లు విశ్రాంతి తీసుకున్నారు. ఈ మధ్యాహ్నానికి ఛాతీలో నొప్పి ఎక్కువగా రావటంతో ఆయన్నునెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ఆయన్ను పరీక్షించి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. ముందు జాగ్రత్తగా ఆయన్ను చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. మంత్రి కాకాణి గోవర్దనరెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి వెళ్ళి కోటంరెడ్డి ఆరోగ్య పరిస్ధితి పై ఆరాతీసి పరామర్శించారు. 47వ రోజు 'జగనన్న మాట.. కోటంరెడ్డి బాట' కార్యక్రమంలో ఉండగా అస్వస్థతకు గురయ్యారని ఆయన అనుచరులు తెలిపారు.
Next Story