Fri Dec 05 2025 07:16:55 GMT+0000 (Coordinated Universal Time)
అనిల్ కుమార్ యాదవ్‌కి పోలీసులు నోటీసులు
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కి నెల్లూరు పోలీసులు నోటీసులు జారీ జారీ చేశారు.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కి నెల్లూరు పోలీసులు నోటీసులు జారీ జారీ చేశారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసుల నిందితుడుగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు జారీ చేశారు. ఈనెల 26న కోవూరు పోలీసు స్టేషన్లో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులలో పేర్కొన్నారు.
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై...
అనిల్ కుమార్ అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి పోలీసులు వెళ్లిపోయారు. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి కూడా కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇద్దరు నేతలు ఒక సమావేశంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు అందడంతో నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని కోరారు .
Next Story

