Thu Feb 26 2026 11:15:41 GMT+0530 (India Standard Time)
నేడు నెల్లూరు మేయర్ ఎన్నిక
నేడు నెల్లూరు మేయర్ ఎన్నిక జరగనుంది.

నేడు నెల్లూరు మేయర్ ఎన్నిక జరగనుంది. మేయర్ స్రవంతి రాజీనామాతో ఖాళీగా మేయర్ పదవి ఉంది. ఇన్ ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు పాలన సాగింది. నేడు కొత్త మేయర్‌ను కార్పొరేటర్లు ఎన్నుకోనున్నారు. వైసీపీ నుంచి అధికార కూటమి లోకి కార్పొరేటర్లు రావడంతో స్రవంతి రాజీనామా చేయాల్సి వచ్చింది.
భారీ బందోబస్తు...
అయితే దీనిపై స్రవంతి న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. అయితే ఈరోజు జిల్లా కలెక్టర్ నెల్లూరు మేయర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. కార్పొరేటర్లు ఎక్కువ సంఖ్యలో కూటమి పార్టీకి మద్దతు ఇస్తుండటంతో మేయర్ పదవి వారికే లభించనుంది. మరొకవైపు నెల్లూరు కార్పొరేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
Next Story

