Fri Apr 10 2026 22:06:23 GMT+0530 (India Standard Time)
Janasena : నెలిమర్లలో కూటమి మధ్య కుంపట్లు... కాలిపోతుందిగా?
నెలిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.

నెలిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా నెలిమర్ల స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది. లోకం మాధవి జనసేనలో నే కాదు.. ఏపీలోని మహిళ ఎమ్మెల్యేల్లో అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఆమె ఆస్తులు వందల కోట్లు ఉంటాయి. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన లోకం మాధవి గెలుపొందారు. అయితే జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానిక టీడీపీ నాయకత్వంతో ఆమెకు కుదరడం లేదు. అనేక విషయాల్లో లోకం మాధవికి, టీడీపీ స్థానిక నేతలకు మధ్య పొసగడం లేదు.
తెలుగు తమ్ముళ్లు గుర్రుగా...
లోకం మాధవి తమను పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఇప్పటికే పలు సార్లు తమ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టు పనులు, నామినేటెడ్ పోస్టుల విషయంలో టీడీపీ నేతలను పట్టించుకోవడం లేదన్నది వారి ప్రధాన ఆరోపణ. అలాగే సంక్షేమ పథకాలు, పనుల ప్రారంభోత్సవాల్లోనూ తమకు ఆహ్వానం ఇవ్వడం లేదని వారు చెబుతున్నారు. తమకు ప్రాధాన్యం ఇవ్వకుండా లోకం మాధవి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తాము గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడి గెలిపించిన సంగతిని మర్చిపోతే ఎలా అని ీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
మాధవి రివర్స్ అటాక్...
ఎమ్మెల్యే భర్త వ్యవహార శైలి కూడా తమకు ఇబ్బందికరంగా మారిందని లోకం మాధవి చెప్పారు. లోకం మాధవి మాత్రం తనకు టీడీపీ నేతలు సహకరించడం లేదని, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో వారు పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తుననారని, అధికారులతో మాట్లాడుకుంటూ తనకు సమాచారం ఇవ్వకుండా పనులు చక్కబెట్టుకుంటున్నారని లోకం మాధవి ఆరోపి్తున్నారు. లోకం మాధవి హాజరయ్యే సమావేశాలకు నెలిమర్ల టీడీపీ నేతలు హాజరు కావడం లేదు. దీంతో నెలిమర్ల కూటమి పరా్టీల మధ్య విభేదాలు మరింత ముదిరినట్లియింది. ఇరు పార్టీల నాయకత్వం దీనిపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
Next Story

