Thu Mar 19 2026 15:17:45 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీలో ద్రౌపది ముర్ము పర్యటన
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను కలవనున్నారు

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నేడు ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా మంగళిగిరి లోని ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులతో సమావేశమవుతారు. ముఖ్యమంత్రి జగన్ ఆమకు ఎంపీలు, ఎమ్మెల్యేలను పరిచయం చేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని ద్రౌపది ముర్ము కోరనున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఓటు వేసే విధానాన్ని కూడా తెలపనున్నారు.
జగన్ ఇంటికి...
అనంతరం అక్కడి నుంచి నేరుగా ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి జగన్ మర్యాదపూర్వకంగా తన నివాసంలో ఇచ్చే తేనేటి విందుకు హాజరుకానున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆమె గన్నవరం విమానాశ్రయం చేరుకుని బయలుదేరి వెళ్లనున్నారు. టీడీపీ కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపింది. అయితే ఆమె టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కలుస్తారా? లేదా? అన్నది మాత్రం ఆమె పర్యటన షెడ్యూల్ లో లేదు. ద్రౌపది ముర్ము పర్యటనలో ఆమె వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉంటారు.
Next Story

