Sat Mar 07 2026 14:50:11 GMT+0530 (India Standard Time)
విజయవాడలో కాల్పుల కలకలం
విజయవాడలో పోలీసులపైకి కాల్పుల జరిపిన ప్రయత్నం ఘటన వెలుగు చూసింది

విజయవాడలో పోలీసులపైకి కాల్పుల జరిపిన ప్రయత్నం ఘటన వెలుగు చూసింది. పోలీసులు కార్టన్ సెర్చ్ చేస్తుండగా ఒక వ్యక్తి పోలీసులపైకి కాల్పులకు యాత్నించాడు. విజయవాడ నగరంలో బస్టాండ్ సమీపంలోని ఒక లాడ్జీలో ఈ ఘటన కలకలం రేపింది. ఆ హోటల్ లో తనిఖీలు చేపట్టిన సమయంలో పోలీసులు ఈగల్ టీంపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు.
వరంగల్ నుంచి వచ్చి...
అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని ప్రశ్నించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. నిందితుడు వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతను ఎందుకు విజయవాడ వచ్చాడు? అతని వద్ద తుపాకీ ఎందుకు ఉందన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే అదృష్ట వశాత్తూ ట్రిగ్గర్ ప్రెస్ కాకపోవడంతో పేలుడు సంభవించలేదని పోలీసులు తెలిపారు.
Next Story

