Fri Dec 05 2025 15:42:43 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మళ్లీ జోగయ్య లేఖ.. పొత్తు విఫలప్రయోగమేనంటూ
మరోసారి సీనియర్ నేత హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోసారి సీనియర్ నేత హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనకు ఇరవై అయిదు నుంచి ముప్పయి సీట్లు ఇస్తే విఫల ప్రయోగమేనని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ తక్కువ సీట్లను జనసేనకు ఇవ్వాలని చూస్తుందని అన్నారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖను విడుదల చేశఆరు. జనసేన ఎదుగుదలకు టీడీపీ అడ్డంకి అని ఆయన అన్నారు. యాభై అసెంబ్లీ, ఆరు పార్లమెంటు స్థానాలను కేటాయించాలని ఆయన లేఖలో కోరారు. టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
పొత్తు ధర్మానికి...
పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తుందని హరి రామ జోగయ్య అన్నారు. పవన్ కల్యాణ్ పెద్దమనసుతో సర్దుకు పోవడం దీనికి కారణమా? అని ఆయన లేఖలో ప్రశ్నించారు. టీడీపీ ఇలాంటి చర్యలు మానుకోవాలని ఆయన లేఖలో కోరారు. ఓట్లు బదిలీ కావాలంటే జనసేనకు అధిక సీట్లను కేటాయించడమే టీడీపీ ముందున్న లక్ష్యమని ఆయన లేఖలో వివరించారు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా టీడీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తే పార్టీ క్యాడర్ ఊరుకోబోదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story

