Thu Mar 19 2026 13:51:38 GMT+0530 (India Standard Time)
తెలుగు రాష్ట్రాలకు ఎన్సీసీ భారీ విరాళం
వరదలతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరదలతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ కు కోటి రూపాయలు, తెలంగాణ కు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించినట్లు ఎన్సీసీ లిమిటెడ్ డైరెక్టర్ ఎస్.ఆర్.కె. సూర్య శ్రీ కృష్ణరాజు తెలిపారు.
ఏపీకి కోటి రూపాయలు...
ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలసి కోటి రూపాయల విరాళాన్ని అందచేశారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వానికి కూడా అందచేస్తామని చెప్పారు. తాము ఇచ్చిన విరాళంతో వరద ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణంలో వినియోగించాలని ఆయన కోరారు. బాధితులకు పునరావాసం కల్పించడంలో ఇది తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Next Story

