Thu Mar 19 2026 07:21:53 GMT+0530 (India Standard Time)
నవజీవన్ ఎక్స్ప్రెస్ లో మంటలు
నవజీవన్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి

నవజీవన్ ఎక్స్ప్రెస్ కు పెద్ద ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. పాంట్రీకార్ లో ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. మంటలు చెలరేగడంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
గంట సేపు ఆగిన రైలు...
గూడూరు రైల్వే స్టేషన్ లో వెంటనే అధికారులు అప్రమత్తమై మంటలను అదపులోకి తీసుకు వచ్చారు. దీంతో గూడూరులోనే గంటసేపు నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది. రైల్వే శాఖ దీనిపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తుంది.
Next Story

