Thu Mar 19 2026 05:52:20 GMT+0530 (India Standard Time)
ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరిక
ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించింది. రాయలసీమ ఎత్తిపోతల పధకం పనులు చేపట్టవద్దని సూచించింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పధకానికి సంబంధించి పనులు చేపట్టవద్దని సూచించింది. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి పనులు చేపట్టినా దానికి చీఫ్ సెక్రటరీని బాధ్యులను చేస్తామని హెచ్చరించింది.
చీఫ్ సెక్రటరీని....
రాయలసీమ ఎత్తిపోతల పధకంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కమిటీని కూడా నియమించారు. ఇటీవల ఎన్జీటీ సభ్యులు రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని సందర్శించి వెళ్లారు. ఇకపై ఎటువంటి పనులు చేపట్టవద్దని, చేపడితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరింది.
Next Story

