Fri Dec 05 2025 08:23:21 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : బాబు, పవన్ జోడీతో ఏపీ దూసుకెళుతుంది
చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు

చంద్రబాబు, పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ద్వాదశ జ్యోతిర్లాంగాల్లో రెండోది అయిన శ్రీశైల మల్లికార్జునుడిని నేడు దర్శించుకున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి, సంస్కృతికి నిదర్శనమన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని, కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రధాని అన్నారు. గత పదహారు నెలల్లో ఏపీలో అభివృద్ధి శరవేగంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు.
వికసిత్ భారత్ గా...
2047 నాటికి వికసిత్ భారత్ గా తయారవుతుందని మోదీ అన్నారు. 21వ శతాబ్దం భారతీయుల శతాబ్దమని చెప్పారు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి రైలు, రోడ్డు, విద్యుత్తు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశానని అన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ పెరుగుతుందని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల కర్నూలు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. రైలు మార్గాన్ని పెంచుకుంటూ వెళుతున్నామని, తద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఏర్పడుతుందని మోదీ అన్నారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ సంస్థ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని మోదీ అన్నారు. అమెరికా బయట పెట్టుబడుల్లో ఏపీలో తమ పెట్టుబడి ఎక్కువని గూగుల్ సీఈవో తనతో చెప్పారని మోదీ వివరించారు.
విశాఖపట్నం ఏఐ హబ్ గా...
విశాఖపట్నం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, కనెక్టివిటీ హబ్ గా ఏర్పాటు కాబోతుందని మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో పాటు రాయలసీమ అభివృద్ధి కూడా జరగాలని అన్నారు. కర్నూలులో ఈరోజు ప్రారంభమైన పనులు రాయలసీమలో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని మోదీ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని విస్మరించి దేశానికి నష్టం చేకూర్చాయని మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారబోతుందని మోదీ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో ఉపయోగపడనున్నాయని అన్నారు.
Next Story

