Fri Mar 20 2026 10:24:02 GMT+0530 (India Standard Time)
పొత్తులపై సీపీఐ నారాయణ సంచలన కామెంట్స్
సీీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై ఆయన మాట్లాడారు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై ఆయన మాట్లాడారు. ఇష్టం ఉన్నా లేకున్నా జనసేన, టీడీపీ, వామపక్షాలు ఏపీలో కలసి ఎన్నికలకు వెళ్లాలని సీీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.అప్పుడే ప్రజలకు కాని, రాష్ట్రానికి కాని మేలు చేకూరుతుందని నారాయణ అన్నారు.
మూడు పార్టీలు...
కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని జగన్ నిలదీయలేకపోతున్నారన్నారు. ప్రజలకు వందలు ఇస్తూ వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతలు దోచుకుంటున్నారని, ఈ రెండు ప్రభుత్వాలను పంపాలంటే జనసేన, టీడీపీ, వామపక్షాలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నారాయణ పిలుపు నిచ్చారు.
Next Story

