Sat Jan 10 2026 21:23:58 GMT+0000 (Coordinated Universal Time)
కూటమి నేతల మధ్య సమన్వయం ఉండాలి
కాకినాడ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీలు,ప్రజాప్రతినిధులతో ఇన్ ఛార్జి మంత్రి నారాయణ సమావేశం అయ్యారు

కాకినాడ జిల్లా టీడీపీ ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీలు,ప్రజాప్రతినిధులతో ఇన్ ఛార్జి మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ,పార్టీ కమిటీల నియామకంపై చర్చించారు. వీలైనంత త్వరగా పెండింగ్ పోస్టులకు అభ్యర్ధుల జాబితా సిద్ధం చేయాలని సూచించిన మంత్రి నారాయణ కూటమి నాయకుల మధ్య సమన్వయం ఉండాలని చెప్పారు.
పార్టీ తరపున చేపడుతున్న...
పార్టీ తరపున చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి నారాయణకు ఎమ్మెల్యేలు వివరించారు. పార్టీలో ఎలాంటి విభేదాలకు తావు లేకుండా కలిసికట్టుగా ముందుకెళ్లాలని సూచించిన మంత్రి నారాయణ పార్టీ అధిష్టానం సూచనల మేరకు విధిగా అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ సానా సతీష్,ఎమ్మెల్యేలు చిన రాజప్ప,జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్య ప్రభ,వనమాడి వెంకటేశ్వరరావు,ఎమ్మెల్సీలు రాజశేఖరం,పద్మశ్రీ,మాజీ ఎమ్మెల్యేలు వర్మ,పిల్లి అనంత లక్ష్మీలు పాల్గొన్నారు.
Next Story

