Thu Mar 05 2026 18:02:49 GMT+0530 (India Standard Time)
ఎంపీ లావుకు తప్పిన ప్రమాదం
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులకు తృటిలో ప్రమాదం తప్పింది

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులకు తృటిలో ప్రమాదం తప్పింది. పల్నాడు జిల్లా లో వినుకొండలో నూతనంగా ఏర్పాటు చేసిన సురేష్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సందర్శనకి వెళ్లిన ఎంపీ లావు కృష్ణ దేవరాయలు రెండవ అంతస్థుకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులుకూడా లిఫ్ట్ ఎక్కారు. రెండవ అంతస్తుకి వెళ్ళాక ఒక్కసారిగా తెగి గ్రౌండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ పడిపోయింది.
లిఫ్ట్ పడిపోవడంతో...
రెండవ అంతస్తు నుండి లిఫ్ట్ కుప్పకూలడటంతో ఎంపీతో పాటూ లిఫ్ట్ లో ఉన్న పలువురు వ్యక్తులు కింద పడిపోయారు. లిఫ్ట్ పడిపోవడంతో కొంత సేపు తీవ్ర ఆందోళన చెందిన ఎంపీ భద్రతా సిబ్బంది వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ లో పడిని వారిని బల్ల వేసి బయటకు తెచ్చారు. ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా బయట పడటంతో ఊపిరిపీల్చుకున్నారు.
Next Story

